4 Sep 2018

Small Business Loans Eligibility And Process In Telugu

small business loan


ప్రతి ఒక్క వ్యాపారానికి పెట్టుబడి చాలా అవసరం. ముఖ్యంగా చిన్న తరహా మధ్య తరహా వ్యాపారులకు పెట్టుబడి కొరత ఎక్కువగా ఉంటుంది.

ఈ వ్యాపారులు పెట్టుబడి కోసం ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులపై ఆధారపడి ఉంటారు.

ఈ పద్ధతి ఏ మాత్రం కూడా మంచిది కాదు. వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే అతి తక్కువ వడ్డీ కి రుణం తెచ్చుకొని వ్యాపారంలో పెట్టుబడిగా పెడితే లాభాలు ఆర్జించవచ్చు. తక్కువ వడ్డీ బ్యాంకులు మాత్రమే ఇస్తాయి.

ఈ ఆర్టికల్ లో బ్యాంకులు చిన్నతరహా మధ్యతరహా వ్యాపార రుణం ఏ విధంగా ఇస్తాయో  తెలుసుకుందాం.

మనందరికీ తెలుసు బ్యాంకు రుణం ఇవ్వడం అంటే చాలా కష్టమని. కానీ ఇప్పుడు బ్యాంక్ లో ఆ పద్ధతి పూర్తిగా మారిపోయింది.

ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ చిన్న తరహా మధ్య తరహా వ్యాపారుల కోసం ఎన్నో పథకాలు తెచ్చాయి. అందులో ముఖ్యమైనది ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం.

కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలే కాక బ్యాంకులు కూడా స్వతః స్మాల్ బిజినెస్ లోన్స్ నీ ఇస్తున్నాయి.

మీరు వ్యాపార పెట్టుబడి కోసం బ్యాంకు నుండి రుణం తీసుకోవాలంటే ఈ కింది వాటిని తెలుసుకోండి.

1. మీ వ్యాపారం ముందుగా ప్రారంభించి  ఉండాలి. ఏ బ్యాంకు లోనైతే మీరు రుణం తీసుకోవాలనుకుంటున్నారు. ఆ యొక్క బ్యాంకులో మీకు ఖాతా ఉండి ఉండాలి.

2. మీ ఖాతా వాడకంలో ఉండాలి దీనికి అర్థం తరచూ డబ్బులు వేయడం తీయడం లాంటి లావాదేవీలు జరిపి ఉండాలి. ఎంత ఎక్కువ లావాదేవీలు జరిపి ఉంటే మీరు అంత ఎక్కువ రుణం పొందడానికి అర్హత కలిగి ఉంటారు.

3. మీరు ఉండే గృహం సొంత గృహ మై వుండాలి. మీరు వ్యాపారం నిర్వహించే స్థలం లీజు గాని అద్దెకు గాని తీసుకున్నట్టు అగ్రిమెంట్ ఉండాలి మరియు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలి.

ఉదాహరణకి. లేబర్ లైసెన్స్, మున్సిపల్ లైసెన్స్ లేదా జీఎస్టీ లైసెన్స్.

4. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ రెండు సంవత్సరాలు లేదా ఎక్కువ ఉండాలి. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ధ్రువీకరించబడిన వై ఉండాలి.

మీయొక్క ఇన్కమ్ ఇంకా మరియు బిజినెస్ టర్నోవర్ మీద ఆధారపడి మీయొక్క రుణం ఆమోదిస్తారు.

5. cibile score అనేది అతి ముఖ్యమైనది. ఏ బ్యాంక్ అయినా లేదా ఏ ప్రైవేట్ ఫైనాన్షియర్స్ కంపెనీ అయినా మొదటగా చూసేది ప్రొప్రైటర్ యొక్క వ్యక్తిగత సిబిల్ స్కోర్ చూస్తారు.

పాన్ కార్డ్ ఆధారంగా ఈ cibil స్కోర్ తెలుసుకోవచ్చు. cibil score 680 పాయింట్స్ కంటే తక్కువగా ఉంటే రుణం పొందలేరు.

6. బ్యాంకు వారికి మీయొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బిజినెస్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్, మరియు ప్రస్తుత నివాసం ఉంటున్న ఏదైనా ఆధారాన్ని బ్యాంకు వారికి ఇవ్వాలి.

మీరిచ్చిన పూర్తి వివరాలను బ్యాంకు వారు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రుణం మంజూరు లేదా తిరస్కరించడమో జరుగుతుంది.

No comments:

Post a Comment