1 Oct 2018

Mannem Madhusudana Rao[MMR] Inspiring Story

Mannem Madhusudana Rao


మన్యం మధుసూదన్ రావు MMR గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ మరియు DICCI ఆంధ్రప్రదేశ్ కి ప్రెసిడెంట్.

ఎంతో పేదరికంలో పుట్టిన MMR వేల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీకి అధిపతి గా ఎదిగిన తీరు ఎంతో మంది యువతకు ఆదర్శనీయం.

మధుసూదనా రావు పుట్టింది పాళుకురు, కండుకూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.

మధుసూదనా రావు తండ్రి పేరు పేరయ్య తల్లి పేరు రాములమ్మ వీళ్లకు మొత్తం ఎనిమిది మంది సంతానంలో
మధుసూదనా రావు ఐదో వాడు.

అందరూ పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి ఈ కుటుంబానిది. కానీ మధుసూదనా రావు
తల్లిదండ్రులు వాళ్ల పిల్లల్లో ఎవరినైనా ఉన్నతమైన చదువు చదివించాలని ఉండేది.

మధుసూదనా రావు మరియు మధుసూదనా రావు అన్నకు చదువుకునే అదృష్టం లభించింది కుటుంబం మొత్తం కష్టపడి వీరిద్దరి చదివించారు.

అలా మధుసూదనా రావు డిప్లమా పూర్తి చేశారు. కానీ   డిప్లమా పూర్తి చేసిన మధుసూదనా రావుకి ఉద్యోగం దొరకలేదు. దీంతో హైదరాబాద్ అక్క దగ్గరికి వచ్చిన మధుసూదన్ రావు కుటుంబ అవసరాలు తీర్చడం కోసం   BSNL కేబుల్ గుంతలు తవ్వడానికి కూలి పని కోసం వెళ్లేవాడు మరియు తాపీ మేస్త్రి గా కూడా పని చేసేవాడు.

అలా కూలికి వెళ్తే ఆయనకు ఒక రోజుకు లభించే కూలీ 20 రూపాయలు. అలాగే ఏ పని దొరికితే ఆ పని చేసుకునే మధుసూదనరావు. ఒకరోజు BSNL కేబుల్ గుంతలు తవ్వడానికి లేబర్ దొరకట్లేదు అన్న విషయం ఒక కాంట్రాక్టర్ ద్వారా మధుసూదన్ రావు కి తెలియడం జరిగింది.

మధుసూదన్ రావు కి ఒక ఆలోచన వచ్చింది ఎంతోమంది కూలి పని చేసే వాళ్లు రోజు పని దొరకక బాధపడేవారు అలాంటప్పుడు నేను వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ పని చేయిస్తే నాకు ఎంతో కొంత కమిషన్ వస్తుంది కదా అన్న ఆలోచన మధుసూదనరావు మదిలో వెలిగింది.

కానీ ఇక్కడ ఒక సమస్య మొదలైంది MMR నీ కాంట్రాక్టర్  నమ్మలేదు లేబర్ ని తీసుకొస్తాం అంటే నీవెవరో నాకు తెలియదు నువ్వు లేబర్ ని తీసుకువచ్చి పని చేపిస్తావ్ అంటే నేను నిన్ను ఎలా నమ్మాలి నీకు ఎలా అడ్వాన్స్ ఇవ్వాలి అని ప్రశ్నించాడు.

దీంతో మధుసూదన్ రావు కాంట్రాక్టర్ తో మీరు నాకు డబ్బును ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు లేబర్ తో పని పూర్తి చేసిన తర్వాతనే మీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటానని ఒక ఒప్పందానికి వచ్చాడు.

వాస్తవానికి మధుసూదనరావు దగ్గర చిల్లిగవ్వ లేదు. పెట్టుబడి కోసం మూడు వేల రూపాయలు అవసరం.

డబ్బు కోసం అక్కను ఆశ్రయించాడు మధుసూదనరావు 3 వేల రూపాయలు అప్పుగా తీసుకొని. ఆ డబ్బుని కూలీలకు అడ్వాన్స్గా చెల్లించాడు.

అలా మొదటిసారిగా మధుసూదనరావు కి 20 వేల రూపాయలు లాభం వచ్చింది.

అలా లేబర్ కాంట్రాక్టర్ గా మొదలైన మధుసూదనా రావు వ్యాపారం రెండు సంవత్సరాలలోనే కోట్ల రూపాయల టర్నోవర్ కి ఎగబాకింది.

వ్యాపారం సాఫీగా జరుగుతున్న సమయంలోనే స్నేహితుని రూపంలో పెను ప్రమాదం ఎదురైంది. మధుసూదన్ రావు స్నేహితుడొకడు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తాం అని నమ్మబలికి రెండు కోట్ల రూపాయలు పెట్టుబడిగా మధుసూదన్ రావు దగ్గర తీసుకున్నాడు. కొన్ని రోజుల్లో నే వ్యాపారంలో నష్టాలు వచ్చాయని పెట్టుబడి అంతా పోయిందని మధుసూదన్ రావు తో చెప్పడంతో మధుసూదనా రావు జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది.

సంపాదించిందంతా పోగొట్టుకోవడంతో మళ్ళీ వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి లేక కర్ణాటకలోని ఒక కంపెనీలో 10 వేలకు ఉద్యోగం చేశాడు.

మళ్లీ మధుసూదన్ రావు 3లక్షల రూపాయలను ఎలాగోలాగా పెట్టుబడిగా సమకూర్చుకొని మళ్లీ లేబర్ కాంట్రాక్టర్ గా వ్యాపారం మొదలుపెట్టాడు. ఈసారి వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి మధుసూదనరావు ఏర్పడలేదు. అంచలంచలుగా ఎదగడం మొదలు పెట్టాడు ఒక రోజు కూలీగా మొదలైన మధుసూదన్ రావు జీవితం 11 సంస్థలకు చైర్మన్ గా ఎదిగిన తీరు సినిమాను తలపిస్తుంది.

ఇప్పుడు విదేశీ మీడియా లో మారుమోగుతున్న పేరు MMR గ్రూప్స్. విదేశీ డాక్యుమెంటరీలు స్వదేశీ మాక్సిన్ లో చోటు దక్కించుకున్న వ్యక్తి మన్యం మధుసూదనరావు.

రోజు కూలీగా, వాచ్మెన్ గా, మేస్త్రీ గా పనిచేసే మన్యం మధుసూదనరావు స్వయంకృషితో 11 సంస్థలను స్థాపించి వేల ఉద్యోగాలు కల్పించి అత్యంత ప్రభావితుల జాబితాలో చేరారు.

No comments:

Post a Comment